నవతెలంగాణ-వర్ధన్నపేట
43వ డివిజన్, ఖిలా వరంగల్ మండలం మామునూరులో స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులు కలిసి మామునూరు ను మండల కేంద్రం చేయాలని చేపట్టిన రిలే దీక్షలు రెండవ రోజుకు చేరుకున్నాయి. మామునూరు మండల సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షకు పలువురు సంఘీభావం వ్యక్తం చేస్తూ వారి మద్దతు తెలుపుతున్నారు ప్రత్యేక మండలం కోసం అన్ని వర్గాల ప్రజలు ఏకతాటి పైకి వచ్చి పట్టుపట్టారు. ప్రభుత్వాలు మారుతున్నాయి. మామునూరు ఎయిర్ పోర్ట్ మంజూరైనప్పటికీ తమ ప్రాంతానికి గుర్తింపు లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వందల ఎకరాలు ఎయిర్ పోర్టుకు ఇచ్చినట్లు ఇచ్చిన రైతులు నేడు కూలీలుగా మారారని తమకు గుర్తింపులు ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.ఖిలా వరంగల్ మండలం లో మామునూరు కలపడం వల్ల తమకు ఇబ్బందులతో పాటు తమ ప్రాంతానికి గౌరవం లేదన్నారు. మామునూరును మండలం గా ప్రకటించి గుర్తింపుని ఇవ్వాలని పలువురు స్థానికులు,ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు రెండవ రోజు జరిగిన రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు. కొండేటి శ్రీధర్ పాల్గొని సంఘీభావం తెలిపారు మామునూరు మండలం కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయని ప్రత్యేక గుర్తింపు ఇవ్వవలసిన అవసరం ఉందన్నారు రెండవ రోజు చేపట్టిన రిలే దీక్షలోఎర్ర విజయ్ కుమార్ ,దూరిశెట్టి వెంకట లక్ష్మి ,నల్లతిగల రాజమౌళి ,సింగారపు అరుణ, ఎండి రఫీ,వెంకటరమణ,మన్నేఓదెలు ,మడిపెల్లి నాగేందర్ సల్లూరి సుదర్శన్ ,దూరిశెట్టి ఎల్లయ్య, పలువురు నేతలు పాల్గొన్నారు.



