- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 5 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తోంది. స్పెషల్ పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో 4,500 కానిస్టేబుల్, 500 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలకు ఆర్థిక శాఖ నుంచి త్వరలోనే అనుమతులు లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీస్ శాఖలో సుమారు 17 వేల ఖాళీలు ఉండగా, మొదటి దశలో 5 వేల పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆర్థిక శాఖ అనుమతి లభించిన వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇది నిరుద్యోగ యువతకు శుభవార్తగా మారింది.
- Advertisement -



