Wednesday, February 11, 2026
E-PAPER
Homeకరీంనగర్రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో స్వల్ప వాగ్వివాదం

రాయికల్ మున్సిపల్ ఎన్నికల్లో స్వల్ప వాగ్వివాదం

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్ : పట్టణంలోని రెండవ సాధారణ ఎన్నికల సందర్భంగా 4వ వార్డుకు చెందిన బీజేపీ, బీఆర్‌ఎస్ ఇరు వర్గాల మధ్య స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది. తమ ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్గం ఆరోపించగా, తమ సహచరులను బెదిరింపులకు గురి చేస్తున్నారని బీజేపీ వర్గం ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇరువర్గాల నాయకులు, కార్యకర్తల మధ్య కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. అక్కడే విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది వెంటనే స్పందించి ఇరువర్గాలను శాంతింపజేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -