- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ రైతులకు వాతావరణ కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయని వెల్లడించింది. ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలలో సుమారు 30 శాతం మేర రుతుపవనాలు విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దేశంలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి.
- Advertisement -



