- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్‌తో చర్చలు జరిపేందుకు సోమవారం ప్యాంగ్‌యాంగ్‌కు చేరుకున్నారని చైనా జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. ఇరు నేతలు ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక స్నేహాన్ని కొనసాగించడానికి, ద్వైపాక్షిక సంబంధాలను మరింత అభివృద్ధి చేసే దిశలో చర్చలు జరగనున్నాయని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది.
దాదాపు ఈ ఏడేళ్లలో తొలిసారి జిన్‌పింగ్ ఉత్తరకొరియాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
2024లో రష్యా అధ్యక్షడు పుతిన్ ఉత్తరకొరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు నేతలు రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశారు.
- Advertisement -


