Wednesday, February 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుశేరిగూడలో టెన్షన్....టెన్షన్

శేరిగూడలో టెన్షన్….టెన్షన్

- Advertisement -

నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం  : శేరిగూడలో పోలింగ్ కేంద్రం వద్ద టెన్షన్.. టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలింగ్ స్టేషన్ ముందున్న ఇంట్లోని యువకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని వారి కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో ఒకసారిగా ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. పోలింగ్ స్టేషన్ సమీపంలోనే భారీ స్థాయిలో ఆయా రాజకీయ పార్టీల కార్యకర్తలు, ప్రజలు భారీ స్థాయిలో గుమ్మి కోరడంతో ఓటింగ్కు వచ్చే ఓటర్లు ఇబ్బందులకు గురయ్యారు. అక్కడే ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఓటు వేయాలని ఓటర్లను ప్రసన్నం చేసుకునే క్రమంలో ఇబ్బందికర పరిస్తితులు కనిపించాయి. ఇబ్రహీంపట్నం ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడి నుంచి గుమ్మి కూడిన ప్రజలను 100 మీటర్ల దూరం ప్రయత్నించే ప్రయత్నంలో భాగంగా ప్రజలను చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రానికి సమీపంలో ఉన్న ఇంటిలో ఇద్దరు, ముగ్గురు యువకులు ఉండడంతో వారిని సైతం అక్కడ నుంచి పంపించే ప్రయత్నం పోలీసులు చేశారు.

ఈ తరుణంలోనే తమ ఇంట్లోనే ఉన్నామని, మమ్మల్ని ఎందుకు పొమ్మంటున్నారని పోలీసుల మీదకి ఎదురు తిరిగారు. ఓటింగ్ను ప్రశాంతంగా నిర్వహించే క్రమంలో ప్రజలను అక్కడి నుంచి పంపించాలన్న పోలీసుల ప్రయత్నానికి  ఆ యువకులు అడ్డుతగలగడంతో ఇరువురి మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. దాంతో సదరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని తన వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో యువకుల కుటుంబ సభ్యులు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. తమ పిల్లలను ఎందుకు తీసుకుపోతున్నారని, ఏం తప్పు చేశారని తమ ఇంటిలో కూడా తాము ఉండకూడదా అంటూ పోలీసు వాహనానికి మహిళలు ఎదురు తిరిగారు. దాంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. 

అయితే 16వ వార్డు కౌన్సిలర్ భర్త అల్వాల వెంకటరెడ్డి సదురు మహిళలను సముదాయించి పోలీసులకు సహకరించాలని, అవసరమైతే పోలీస్ స్టేషన్ వెళ్లి తమ పిల్లల్ని విడిపించుకుందామని సముదాయించడంతో మహిళలు వెనుతిరిగారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకులను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ లోనే శేరిగూడలోని 14, 15, 16 వార్డులు మొదటి నుంచి రాజకీయ పార్టీల ప్రచారంతో హాట్ టాపిక్ గా మారింది. ప్రధాన పార్టీల అభ్యర్థులకు స్వతంత్ర అభ్యర్థి ధీటుగా ప్రచార పర్వాన్ని కొనసాగిస్తుండడంతో ఒకరికి మించి ఓరు యుద్ధ వాతావరణ తలపించుకునే విధంగా ప్రచారాన్ని కొనసాగించారు. ఓటింగ్ సరళి సందర్భంగా కూడా అదే సరళి కనిపించింది. ఈ క్రమంలోనే ఇలాంటి చెదురు మదురు సంఘటనలు చేసుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -