Wednesday, February 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డ్రోన్ సాయంతో చిరుత పులి అన్వేషణ చేసిన ఫారెస్ట్ అధికారులు. 

డ్రోన్ సాయంతో చిరుత పులి అన్వేషణ చేసిన ఫారెస్ట్ అధికారులు. 

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామంలోని శివారు ప్రాంతాలలో డ్రోన్ సాయంతో ఫారెస్ట్ అధికారిని డీఎఫ్ఓ సంతోష ఆధ్వర్యంలో బీట్ అధికారి రాములు నేతృత్వంలో చిరుత పులి జాడను తెలుసుకునేందుకు డ్రోన్ సహకారాన్ని తీసుకోవడం జరిగిందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ సంతోష మాట్లాడుతూ.. దోస్తుపల్లి, బంగారు పల్లి, డోన్గావ్, శక్తి నగర్, పెద్దగుల్లా, మైబాపూర్, గుండూర్ తో పాటు పక్క మండలాలైన మద్నూర్, పెద్ద కొండపై గల్ లో రెండు రోజుల క్రితం పులి కూన రోడ్డుపై తిరుగుతున్నట్టు గ్రామస్తులు తెలిపినారు . అట్టి విషయాన్ని ఫారెస్ట్ అధికారులు కూడా నిర్ధారించడం జరిగింది. ఇలా పలు ప్రాంతాలలో చిరుత పులి సంచరించినట్టు ఫారెస్ట్ అధికారులు గుర్తించడం జరిగింది. జుక్కల్ మండలంలో దోస్తుపల్లిలో చిరుత పులి పులిని చంపిన సంఘటన పాఠకులకు తెలిసిన విషయమే. జుక్కల్ మండలం ప్రాంత వాసులకు రోజు ఎక్కడో ఒకచోట పశువుల పైన గొర్రెల పైన కుక్కల పైన దాడులు చేసి చంపేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురి కావడంతో ఎవరు ఏమి చేయలేసి చేయడం లేదని ఆరోపణలు రావడంతో ఫారెస్ట్ అధికారులు నేడు డ్రోన్ సాయంతో పులిజాడను తెలుసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కడపటి సమాచారము అంది వరకు పులిజాడ ఎక్కడ కనిపించలేదని డివైఎఫ్ఓ తెలిపారు. 

ఫోటో:- డ్రోన్ సాయంతో పులిజాడను తెలుసుకుంటున్న ఫారెస్ట్ అధికారులు. తిలకిస్తున్న గ్రామస్తులు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -