Wednesday, February 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వే బిల్లు పేరుతో ఇసుక అక్రమ రవాణా...

వే బిల్లు పేరుతో ఇసుక అక్రమ రవాణా…

- Advertisement -

నవతెలంగాణ – తంగళ్ళపల్లి 
రేబిల్లుల పేరుతో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. తంగళ్ళపల్లి మండలంలో నిర్మాణాల అవసరాల కోసం ఇసుకను రెవెన్యూ శాఖ వారంలో రెండు రోజులు అనుమతి ఇస్తుంది. ఆ అనుమతిని ఆసరాగా చేసుకొని ట్రాక్టర్ యజమానులు బేబీలు పేరుతో ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. బుధవారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని మానేరు వాగు నుండి రెవెన్యూ శాఖ నిర్మాణాల కోసం ఇసుక అనుమతి కావాలని దరఖాస్తు చేసుకొని డిడి చెల్లించిన వారికి అనుమతి ఇచ్చారు. కానీ ట్రాక్టర్ యజమానులు వాటిని ఆసరాగా చేసుకొని అనుమతి ఉన్నచోటికి కాకుండా మరోచోటికి ఇసుకను అక్రమ రవాణా చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. అనుమతుల పేరుతో ఇసుక రవాణా చేసేందుకు అనుమతి తీసుకున్న చోటుకి ఇసుక రవాణా చేస్తే డబ్బులు తక్కువ వస్తాయని అనుమతి లేని మరోచోటికి ఈ అనుమతి ఉన్న వేబిళ్ళతో ఇసుక అక్రమ రవాణా చేస్తే అత్యధికంగా డబ్బులు దండుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బుధవారం ఇసుక వే బిల్లు అనుమతి పేరుతో సిమెంట్ బ్రిక్స్ తయారీ కేంద్రానికి అనుమతి లేకుండానే ట్రాక్టర్ యజమాని బేబీలు లేకుండానే ఇసుకను రవాణా చేసి డంపు చేశారు. ఇలా అక్రమ రవాణా చేయడం ద్వారా ఇళ్ల నిర్మాణాలు చేపట్టకున్న వారి వద్ద నుండి అధిక మొత్తంలో డబ్బులను ట్రాక్టర్ యజమానులు వసూలు చేస్తున్నారు. ఒక్క ట్రాక్టర్ ట్రిప్పు ఇసుక కనీసం రూ.2వేల నుండి రూ.4వేల వరకు ట్రాక్టర్ యజమానులు అమాయక ప్రజల వద్ద నుండి దండుకుంటున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టి తక్కువ ధరకు ఇసుకను రవాణా చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు  కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -