Tuesday, June 9, 2026
E-PAPER
Homeసినిమాసరికొత్త అనుభూతినిచ్చే 'ఓజీ టూర్` కాన్సర్ట్

సరికొత్త అనుభూతినిచ్చే ‘ఓజీ టూర్` కాన్సర్ట్

- Advertisement -

ఏసీటీసీ ఆధ్వర్యంలో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ నిర్వహిం చబోయే ‘ఓజీ టూర్ ఇండియా’ మెగా మ్యూజికల్ ఈవెంట్ ఈనెల 13న హైదరాబాద్‌లోని బౌల్డర్ హిల్స్‌లో గ్రాండ్‌గా జరగనుంది. సంగీత ప్రియులకు ఓ ప్రత్యేక అనుభూతిని అందించనున్న ఈ మ్యూజికల్ ఈవెంట్‌కు సంబం ధించిన వివరాలను తెలియజేస్తూ నిర్వాహకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. తమన్ మాట్లాడుతూ,’ఓజీ సినిమా అప్రిషియేషన్ సెలబ్రేషన్‌ను కొన సాగిస్తూ ‘ఓజీ టూర్ ఇండియా’ను నిర్వహిస్తున్నాం. ఎక్కడ చూసినా ‘ఓజీ’ మ్యూజిక్ వినిపిస్తోంది. ఆ సెలబ్రేషన్‌ను ఒక ఐకాన్‌గా తీసుకుని ఈ కాన్సర్ట్ ను రూపొం దించాం. ఈ రోజు నుంచే పలువురు ప్రముఖులను కలుస్తున్నాం. వచ్చే వారం రోజుల పాటు రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తాం. అలాగే కమిషనర్ ని, డీఐజీ ని కూడా కలిసి ఈవెంట్ అద్భుతంగా జరిగేందుకు అవసర మైన అన్ని జాగ్రత్తలు తీసుకుం టున్నాం. మాకు ప్రేక్షకులే దేవుళ్లు. వారి భద్రత, సౌకర్యాలే మా తొలి ప్రాధాన్యత. ప్రేక్షకులు ఎంతో సౌకర్యవంతంగా, ఆనందంగా ఈ షోను ఆస్వాదించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. సినిమా వేడుకల్లో మీ అందరినీ కలుస్తూనే ఉంటాను. కానీ తొలిసారి ఇలా వ్యక్తిగతంగా ‘ఓజీ టూర్ ఇండియా’ ద్వారా కలవడం చాలా ఆనందంగా ఉంది. జూన్ 13న హైదరాబాద్‌లో, జూలై 11న బెంగళూరులో, ఆగస్టు 15న చెన్నైలో, సెప్టెంబర్ 25న వైజాగ్‌లో ఈవెంట్లు నిర్వహిస్తున్నాం.

ఈ నాలుగు నగరాల్లో జరగనున్న టూర్‌కు హైదరాబాద్ నుంచే గ్రాండ్ స్టార్ట్ ఇస్తున్నాం. నేను చేసే ప్రతి షో ద్వారా వచ్చే రెమ్యునరేషన్‌ను ఎప్పుడూ చారిటీకి అందిస్తుంటాను. ఈ షోకు సంబంధించిన వివరాలను కూడా కార్యక్రమం పూర్తైన తర్వాత వెల్లడిస్తాను. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నేను చేసిన సూపర్ హిట్ పాటలను ఎంపిక చేసి, అద్భుతమైన కొరియోగ్రఫీతో ప్రేక్ష కుల ముందుకు తీసుకొస్తున్నాం. ఈ ఈవెంట్‌లో అందరి హీరోల పాటలు ఉంటాయి. ఇలాంటి లైవ్ షోలు చేయడం వల్ల ప్రేక్షకులతో ప్రత్యక్ష అనుబంధం పెరుగుతుంది. ఏ పాటలకు ఎలా స్పందిస్తున్నారో తెలుసుకోవడం భవిష్యత్ ప్రాజె క్టులకు కూడా ఎంతో ఉపయోగ పడుతుందిఅని అన్నారు. ఏసీటీసీ నిర్వాహకుడు శరవణన్ వాసు మాట్లాడుతూ,'తమన్తో కలిసి ఈ టూర్ చేయడం చాలా ఆనం దంగా ఉంది. ఆయన ‘ఓజీ టూర్ ఇండియా’ గురించి చెప్పినప్పుడే చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఎందుకంటే నేటి జెన్-జీ యువత అంతా ఆయన పాటలతో వైబ్ అవుతున్నారు. ఈ ఈవెంట్ ప్రేక్ష కులకు గొప్ప ఎంటర్‌టైన్‌ మెంట్‌ను అందించబోతోంది. ఈ ఈవెంట్ అందరినీ అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. తొలి కాన్సర్ట్ హైదరాబాద్ నుంచే ప్రారంభించటం ఆనందంగా ఉంది అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -