Tuesday, June 9, 2026
E-PAPER
Homeసినిమాఆశ్చర్యపరిచే కథతో 'ఒక కోర్టు కేస్

ఆశ్చర్యపరిచే కథతో ‘ఒక కోర్టు కేస్

- Advertisement -

ప్రేమ, విరహం, మోసం వంటి అంశాల చుట్టూ ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే వాటికి భిన్నంగా ప్రేమలో మోసపోయిన ఓ యువకుడు తనకు జరిగిన అన్యాయానికి న్యాయం కోరుతూ కోర్టును ఆశ్రయించడం అనే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘ఒక కోర్టు కేస్’. ఓపెన్ ఐస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నాగేష్ పూడి, ముకేష్ పూడి సమర్పణలో, అండమాన్‌కు చెందిన దర్శకుడు గణేష్ పూడి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ స్వయంగా దర్శకత్వం వహించి, నిర్మించిన ఈ చిత్ర టీజర్‌ను హీరో శ్రీకాంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం యువతకు దగ్గరగా ఉండే అంశాన్ని దర్శకుడు కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశారు. ప్రేమలో జరిగే సంఘటనలను లీగల్ డ్రామాగా మలచడం ఆసక్తికరంగా అనిపించింది. టీజర్‌లో ప్రతి షాట్ ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచేలా ఉంద అని అన్నారు.
దర్శకుడు, నిర్మాత గణేష్ పూడి మాట్లాడుతూ, ‘ప్రతి ప్రేమికుడికి తన ప్రేమ కోసం పోరాడే హక్కు ఉంది’ అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన టీజర్‌కు ఇప్పటికే అద్భుతమైన స్పందన లభిస్తోంది. ప్రేమలో మోసపోయిన వ్యక్తి న్యాయం కోసం చేసే పోరాటాన్ని వినోదాత్మకంగా, భావోద్వేగాలతో కూడిన లీగల్ డ్రామాగా తెరకెక్కించాం. ఈ సినిమా ప్రధానంగా బ్రేకప్ తర్వాత జరిగే ప్రతీకారం అనే అంశాన్ని కూడా చూపిస్తుంది. ప్రేక్షకులకు ఇది కొత్త అనుభూతిని అందిస్తుందనే నమ్మకం ఉందిఅని తెలిపారు. 'నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన సినిమా. జూలై 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మా సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను అని హీరో సూర్యాన్ష్ అన్నారు. హీరోయిన్ తనిషా మిశ్రా మాట్లాడుతూ, ‘ప్రేమ, భావోద్వేగాలు, సంఘర్షణలతో కూడిన నా పాత్ర ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది` అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -