నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు (జూన్ 10) వేడుకలు సందర్భంగా రూపొందించిన ‘భోళా బాలయ్యసాంగ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ బోయపాటి శ్రీను ముఖ్య అతిథిగా హాజరై, వేడుకకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చారు. అభిమానుల సందడి మధ్య ఈ కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ,' బాలయ్య ఏంటనేది నేను నా సినిమాల ద్వారా చెప్పాను. ఈ సాంగ్ గురించి చెప్పాలంటే, పాట చాలా అద్భుతంగా వచ్చింది. మ్యూజిక్, లిరిక్స్, డ్యాన్స్, ఆర్టిస్టులు అలాగే ఈ సాంగ్‌ను రూపొందించిన జగన్‌తో సహా అందరూ అద్భుతంగా కుదిరారు. ముఖ్యంగా విజువల్స్ అయితే చాలా గొప్పగా ఉన్నాయి. బాలయ్య చిన్నప్పటి ఫొటోల నుంచి ఇప్పటివరకు ఉన్న విజువల్స్‌ను చూస్తుంటే, పాట కంటే ఆ విజువల్స్‌తోనే ప్రేక్షకులు మరింత మమేకమైపోతారు. ఏ క్యాలెండర్‌లోనూ లేని పండుగ, అభిమానుల గుండెల్లో మాత్రమే ఉండే పండుగ బాలయ్య బాబు పుట్టినరోజు అని తెలిపారు. ‘దేవీ నవరాత్రులు మాదిరిగా బాలయ్య బర్త్‌డేను కూడా జూన్ 1 నుంచి 10 వరకు కన్నుల పండుగగా జరుపుకుంటాం. బాలకృష్ణ సాధించిన విజయాలు, సృష్టించిన చరిత్ర, చేసిన సేవా కార్యక్రమాలు ఒక్కరోజులో చెప్పలేం. ఆయనకు అభిమానిగా, ఆయన వెంట నడవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను` అని ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు అనంతపురం జగన్ చెప్పారు.
‘భోళా బాలయ్య` సాంగ్ అద్భుతం
- Advertisement -
- Advertisement -



