- Advertisement -
నవతెలంగాణ-రాయికల్: రాయికల్ మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులకు చెందిన 24 బ్యాలెట్ బాక్సులను వార్డ్ అభ్యర్థులు,వారి ఏజెంట్ల సమక్షంలో భద్రతా ఏర్పాట్ల మధ్య తరలించారు.జెడ్పి సీఈవో గౌతమ్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు,తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి,ఎస్సై సుధీర్ రావు పర్యవేక్షణలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని కౌంటింగ్ కేంద్రానికి బాక్సులను తరలించినట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించడంతో పాటు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం.
- Advertisement -


