నవ తెలంగాణ, ఉస్మానియా యూనివర్సిటీ:- ఉస్మానియా యూనివర్సిటీ సెంటినరి వసథిగృహము లో ఉండే విద్యార్థులు బుధవారం రాత్రి సెంటినరి వసథిగృహము నుండి ర్యాలీ గా వచ్చి ఆర్ట్స్ కళాశాల రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల నుండి సెంటినరి వసథిగృహము కు వెళ్లే రహదారిపై వీధిలైట్స్ లేవని, మెస్ లో ఆహారము క్వాలిటీ లేదని పలుమార్లు అధికారుల దృష్టిలో తీసుకు పోయిన చర్యలు ఎక్కడ ? అంటు ప్రశ్నించారు. విద్యార్థులు ఎవరైనా ప్రశ్నిస్తే వారిని టార్గెట్ చేస్తున్నట్లు విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక విద్యార్థిని తల్లి సుదూర ప్రాంతం నుండి ఇక్కడ కు వస్తే 2 గంటలు వేచి చూసిన లోపాలకు అనుమతించ లేదని,కనీసం మానవత్వం లేదా ? అంటు ప్రశ్నించారు. మరొక వైపు విద్యార్థులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు
సెంటినరి విద్యార్థుల రాస్తారోకో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



