– ఆర్ సుధాభాస్కర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆర్థిక, సామాజిక, మహిళా సమానత్వమే అంబేద్కర్ జీవితాశయం అని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ సుధాభాస్కర్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి సుధాభాస్కర్ పూలమాలేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నదని విమర్శించారు. దేశంలోని ప్రభుత్వ ఆస్తులను, సహజ వనరులను కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక-కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలతో దేశంలో పేదల సంఖ్య 90 శాతానికి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సంపద మాత్రం కొందరి చేతుల్లో పోగుపడుతున్న తీరును వివరించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు వై. సోమన్న, ఎ. సునీత తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక, సామాజిక, మహిళా సమానత్వమే అంబేద్కర్ జీవితాశయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



