Wednesday, April 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇంజినీరింగ్‌ ఎగుమతుల్లో తెలంగాణ దూకుడు

ఇంజినీరింగ్‌ ఎగుమతుల్లో తెలంగాణ దూకుడు

- Advertisement -

– 118 శాతం అత్యధిక వృద్ధి నమోదు
– 1,827 మిలియన్‌ డాలర్ల నుంచి 7,536 మిలియన్‌ డాలర్లకు పెరుగుదల
– విమాన విడిభాగాలు, రక్షణ రంగ ఉత్పత్తుల్లో పరుగులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఫార్మా రంగ ఎగుమతులకు ప్రసిద్ధి చెందిన తెలంగాణ తాజాగా ఇంజినీరింగ్‌ ఎగుమతుల్లో కొత్త రికార్డులు నెలకొ ల్పుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నేషనల్‌ ఇంపోర్టు-ఎక్స్‌పోర్టు రికార్డు ఫర్‌ ఇయర్లీ అనాలిసిస్‌ ఆఫ్‌ ట్రేడ్‌ (నిర్యత్‌) పోర్టల్‌లో పొందుపరిచిన గణాంకాలను విడుదల చేసింది. దాని ప్రకారం 2023-24 నుంచి 2024-25 మధ్య దేశంలో తెలంగాణ ఇంజినీరింగ్‌ ఎగుమతుల్లో అత్యధికంగా 117.9 శాతం వద్ధిని నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచింది. విమాన విడి విభాగాలు, రక్షణ పరికరాలు, పరిశ్రమ యంత్రాలు వంటి ఇంజినీరింగ్‌ వస్తువుల ఎగుమతుల్లో రాష్ట్రం గణనీయమైన వృద్ధి రేటుని నమోదు చేసింది. కేవలం రెండేండ్లలోనే ఇంజినీరింగ్‌ ఎగుమతులు నాలుగు రెట్లు పెరిగాయని గణాంకాలు స్పష్టం చేశాయి. 2022ు23లో 1,827 మిలియన్‌ డాలర్లుగా ఉన్న ఎగుమతులు 2024ు25 నాటికి 7,536 మిలియన్‌ డాలర్లకు పెరిగాయి. 103శాతం వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు (సీఏజీఆర్‌) ను నమోదు చేయడం చారిత్రాత్మకం. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల సగటు వృద్ధి కేవలం 10 శాతం మాత్రమే నమోదు కావడం గమనార్హం. తెలంగాణ రికార్డు నెలకొల్పే వృద్ధి నమోదు చేసింది. రాష్ట్ర సరుకుల ఎగుమతుల్లో ఇంజినీరింగ్‌ వస్తువుల వాటా 38.44 శాతానికి చేరింది. ఇది తెలంగాణ ఎగుమతి రంగంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ మార్పును సూచిస్తోంది. 2025-26తోపాటు రానున్న పదేండ్లలో ఇదే రకమైన వృద్ధిని కనబరిచే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ వృద్ధికి గల ప్రధాన కారణం ఏరోస్పేస్‌, రక్షణ రంగాల్లో భారీ స్థాయిలో ఉత్పత్తులు పెరగడమేనని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ కమర్షియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్‌లో లాక్‌హీడ్‌ మార్టిన్‌, బోయింగ్‌, ఎయిర్‌బస్‌, సఫ్రాన్‌, జీఈ ఏవియేషన్‌, ప్రాట్‌ అండ్‌ విట్నీ, కాలిన్స్‌ ఏరోస్పేస్‌, హనీవెల్‌ వంటి అంతర్జాతీయ కంపెనీలు తమ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో విడి విభాగాలు ఉత్పత్తి వల్ల తెలంగాణ కీలక తయారీ కేంద్రంగా అవతరించింది.
వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ
సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయాలతో గణనీయమైన పురోగతితో దేశంలో తెలంగాణ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిలిచింది. 2023-24లో ఎనిమిదో స్థానంలో ఉన్న రాష్ట్రం, ఒక్క ఏడాదిలోనే నాలుగో అతిపెద్ద ఇంజినీరింగ్‌ ఎగుమతి దారుగా ముందుకు దూసుకెళ్లింది. పారిశ్రామిక అభివృద్ధి కోసం భారత్‌ ఫ్యూచర్‌ సిటీ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి.
పరిశ్రమల కోసం మరే రాష్టంలో లేని విధంగా భారీగా భూములు కలిగి ఉండడంతో రానున్న కాలంలో తెలంగాణ మరింత దూకుడు ప్రదర్శించనుంది. సేవా రంగాలకోసం క్యూర్‌, తయారీ రంగాలకు ప్యూర్‌, వ్యవసాయ ఆధారిత రంగాలకు రేర్‌లుగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలన్న ఆలోచన దీర్ఘకాలికంగా ఉపయోగపడనుంది. తయారీ రంగ కంపెనీలకు వ్యయ సామర్థ్యం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, వేగంగా వృద్ధి చెందుతున్న తయారీ రంగం కలిగి ఉండడంతో రాష్ట్రానికి మరిన్ని తయారీ కంపెనీలు రానున్నాయి. ఈ వేగంతో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌ వంటి రాష్ట్రాలకు ఇప్పటికే ధీటుగా తెలంగాణ పోటీనిస్తోంది. రానున్న కాలంలో కూడా ఇంజినీరింగ్‌ ఎగుమతులు ఇదే రీతిలో పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -