Wednesday, April 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

- Advertisement -

అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన
నవతెలంగాణ-వైరా

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు మంగళవారం ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపూడి గ్రామంలో వైరా-జగ్గయ్యపేట రహదారిపై రాస్తారోకో చేశారు. గ్రామాల్లో మొక్కజొన్న పంటను ఎక్కడబడితే అక్కడ రాశులు పోసుకుని కొనుగోలు కేంద్రాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం క్వింటాలు మొక్కజొన్నకు రూ.2600 ధర ప్రకటించింది. కానీ, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనందున ప్రయివేట్‌ వ్యాపారులు క్వింటా రూ.16, 17 వందలకే కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి 26 క్వింటాళ్లే కొనే నిబంధన ఎత్తేయాలని, వెంటనే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతు నాయకులతో చర్చించారు. అయినా ససేమీరా అనడంతో రెవెన్యూ అధికారులు వచ్చి మాట్లాడి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కొణిదన కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, కోలారు శ్రీనివాసరావు, రెమల్లె నారాయణ, అష్ణగుర్తి సర్పంచ్‌ కంచర్ల అనిత, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -