Thursday, February 12, 2026
E-PAPER
Homeజాతీయంవ్యవసాయ ఉత్పత్తుల్లో నిర్దిష్ట పప్పు ధాన్యాల తొలగింపు

వ్యవసాయ ఉత్పత్తుల్లో నిర్దిష్ట పప్పు ధాన్యాల తొలగింపు

- Advertisement -

సవరించిన ఫ్యాక్ట్‌షీటు విడుదల చేసిన అమెరికా

న్యూఢిల్లీ : భారత్‌, అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ఫ్యాక్ట్‌ షీట్‌కు వైట్‌హౌస్‌ కీలకమైన సవరణలు చేసింది. ‘నిర్దిష్ట పప్పు ధాన్యాలు’ తొలగింపు, 500 బిలియన్ల డాలర్ల కొనుగోలుకు సంబంధించి ఒప్పందంలో ఉపయోగించిన పదజాలంలో ఈ సవరణలు జరిగాయి. భారత్‌ టారిఫ్‌లు తగ్గించనున్న వ్యవసాయ ఉత్పత్తుల్లో ‘నిర్దిష్ట పప్పు ధాన్యాలు” అనే పదాన్ని తొలగించారు. అలాగే 500బిలియన్ల డాలర్లకు పైగా విలువైన అమెరికా ఉత్పత్తులను కొనుగోలు చేస్తామంటూ భారతదేశం ఇచ్చిన హామీకి వాడిన పదజాలాన్ని కొంత మేరకు సవరించి దాని భావాన్ని తగ్గించారు.

‘కట్టుబడి వుంది’ అనే పదం నుంచి ‘ఉద్దేశిస్తోంది’ అనే అర్ధం వచ్చేలా మార్పు చేశారు. ఒప్పందంలో గల ‘కమిట్స్‌’ (నిబద్ధత) పదాన్ని ‘ఇంటెండ్స్‌’ (ఉద్దేశానికి)కి తగ్గించారు. ఇది తక్కువ కచ్చితత్వాన్ని, మరింత వెసులుబాటుతో కూడిన హామీని సూచిస్తోంది. సోమవారం వైట్‌హౌస్‌ విడుదలచేసిన ఫ్యాక్ట్‌ షీట్‌లో వున్న ‘సర్టెన్‌ పల్సెస్‌’ అనే పదం ప్రస్తావన భారత్‌కు విస్మయాన్ని కలగచేసింది. ఎందుకుంటే ఈ నెల 6న చేసిన సంయుక్త ప్రకటనలో దీన్ని ప్రస్తావించలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -