Wednesday, April 15, 2026
E-PAPER
Homeజాతీయంవీధుల్లోకి వచ్చి పోరాడుతాం

వీధుల్లోకి వచ్చి పోరాడుతాం

- Advertisement -

డీలిమిటేషన్‌పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ హెచ్చరిక
చెన్నై :
నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో ఏకపక్ష నిర్ణయాలను బలవంతంగా రుద్దా లని చూస్తోందని, ఇదే జరిగితే తమ రాష్ట్రంలోని ప్రతిపౌరుడు వీధుల్లోకి వచ్చి పోరాడుతామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ హెచ్చ రించారు. ఈ మేరకు ఆయన మంగళవారం నాడు సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో పోస్టు చేశారు. ఈ నెల 16న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనుందని, అయితే పశ్చిమ బెంగాల్‌, తమిళనాడులో ఎన్నికలకు ముందు ఈ సమావేశం ఉండటం గమనార్హమని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గాల అశాస్త్రీయ పునర్వి భజనను తాము ముందు నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నామని గుర్తు చేశారు. ఈ పునర్విభజన కారణంగా ప్రభావితమయ్యే రాష్ట్రాల ముఖ్య మంత్రు లను, అలాగే ప్రధాన రాజకీయ పార్టీలను ఒకచోట చేర్చి, చెన్నైలో సం యుక్త కార్యాచరణ కమిటీ సమావేశాన్ని నిర్వహించామని తెలిపారు. దక్షి ణాది రాష్ట్రాలపై ఈ పునర్విభజన ప్రక్రియ ప్రభావం ఉండదని ప్రధాని పార్లమెంటులో హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశామని ఈ సందర్భంగా ఆయన మరోమారు గుర్తు చేశారు. అయితే ఇంతవరకు దీనిపై ప్రధాని స్పందించలేదని స్టాలిన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై చర్చిం చేందుకు ప్రధానితో అపాయింట్‌మెంట్‌ కోరినా..వారు పట్టించుకోలేదన్నా రు. డీలిమిటేషన్‌పై ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. తాము ఊరుకునేది లేదన్నారు. తమిళనాడు ప్రేక్షకపాత్ర పోషించదని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబం వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తుందన్నారు. ఇది బెదిరింపు కాదు అని, తుది హెచ్చరిక అని ఆయన పేర్కొన్నారు. ఈ పోరాటంలో తమిళనాడు ప్రజలు తప్పక విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -