Wednesday, April 15, 2026
E-PAPER
Homeజాతీయంసమాఖ్య భారతావనికి మరణశాసనం

సమాఖ్య భారతావనికి మరణశాసనం

- Advertisement -

డీలిమిటేషన్‌ బిల్లుపై సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌
న్యూఢిల్లీ :
మహిళలకు రిజర్వేషన్లు అమల్జేసే పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులు భారతదేశ సమాఖ్య స్ఫూర్తికి మరణశాసనం లాంటి హెచ్చరిక అని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ విమర్శించారు. ఈ మేరకు ఆయన బిల్లుల పత్రాలతో సామాజిక మాధ్యమాల్లో తన స్పందన తెలియజేశారు. మహిళా రిజర్వేషన్ల అమల్జేసే ప్రక్రియలో భాగంగా ప్రవేశపెట్టిన నియో జకవర్గాల పునిర్వభజన (డీలిమిటేషన్‌) బిల్లుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో జనాభా నియంత్రణ చర్యలను దక్షిణాది రాష్ట్రాలు విజయవంతంగా అమల్జేశాయని, ఇప్పుడు జనాభా ప్రాతిపదికగా చేపట్టే ఈ డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రా లకు అన్యాయం జరుగుతోందని, న్యాయబద్ధమైన రాజకీయ అధికారాన్ని హరించి వేస్తున్నారని తప్పుబట్టారు. ఈ విషయంలో సమగ్ర చర్చలు, విస్తృత సంప్రదింపులు జరపాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను కేంద్ర ప్రభు త్వం పూర్తిగా తిరస్కరించిందని బ్రిట్టాస్‌ తెలిపారు. దక్షిణ రాష్ట్రాల ప్రాతిని ధ్యం తగ్గిపోవడంపై తీవ్ర స్థాయిలో ఆందోళనలు వ్యక్తమైనప్పుడు.. ప్రధాని, ఇతర నేతలు అబ్బే అలాంటిదేమీ ఉండబోదని..అన్ని రాష్ట్రాలకు సమానం గా సీట్లలో దామాషా ప్రకారమే పెరుగుదల ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఇతర నాయకులు హామీలు గుప్పించారని, కానీ ఇప్పుడు ముసాయిదా బిల్లుల్లో ఆ హామీలకు నీళ్లొదిలేశారని బ్రిట్టాస్‌ పేర్కొన్నారు.
1971 జనాభా లెక్కలకు బదులుగా 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్‌ నిర్వహిస్తే, ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు గణనీయం గా పెరుగుతాయని, దక్షిణ రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందని, లేదా స్తంభించిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లులు దక్షిణ భారతదేశాన్ని ఉత్తర భారతదేశానికి ఒక రాజకీయ వలసగా మార్చే కుట్రతో కూడిన వ్యూహాన్ని ప్రతిబింబిస్తున్నాయని విమర్శించారు. ప్రతిపాదిత డీలిమిటేషన్‌ కమిషన్‌ సీట్లలో దామాషా పెరుగుదలను నిర్ధారించినప్పటికీ, అది సమాఖ్య సమతుల్యతకు తీవ్రమైన దెబ్బే అవుతుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -