Wednesday, April 15, 2026
E-PAPER
Homeజాతీయంఅప్పుల ఊబిలో కుటుంబాలు

అప్పుల ఊబిలో కుటుంబాలు

- Advertisement -

జీడీపీలో 6.2 శాతానికి రుణాలు… పడిపోయిన పొదుపు
ముంబయి : అధిక ధరలు భారత కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెట్టుతున్నాయి. దేశంలో సామాన్యుల పరిస్థితి ఏమి బాగోలేదని.. అప్పుల భారం పెరిగి పోతుందని క్లైంట్‌ అసోసియేట్స్‌ ప్రయివేటు వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. దేశ జీడీపీ లో కుటుంబాల అప్పులు ఏకంగా 6.2 శాతానికి ఎగిశాయని తెలి పింది. కోవిడ్‌ కంటే ముందు 4.1 శాతంతో పోల్చితే ఇది భారీ పెరుగు దల కావడం ఆందోళనకరం. మరోవైపు ప్రజల నికర ఆర్థిక పొదుపు జిడిపిలో 7.7 శాతం నుండి 5.2 శాతానికి క్షీణించింది. ఇది ఆర్థిక వ్యవస్థలో ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. అమెరికా అధిక టారిఫ్‌లు, పశ్చిమా సియా ఘర్షణల్లోనూ భారత వృద్ధి రేటుకు ఢోకా లేదని బీజేపీ వర్గాలు, అంతర్జాతీయ రేటింగ్‌ ఎజెన్సీలు చేస్తోన్న ప్రకటనలకు భిన్నంగా సామాన్యుల పరిస్థితి చోటు చేసుకోవడం గమనార్హం.
క్రెడిట్‌ కార్డులు, వ్యక్తిగత అప్పులు..
భారతీయ కుటుంబాలు నిత్యావసరాల కోసం కూడా అప్పులపై ఎక్కువగా ఆధార పడుతున్నారు. ఇల్లు గడవడానికైనా లేదా విలాసాలకైనా అనేక కుటుంబాలు అప్పులపైనే ఆధారపడటంతో 2016 నుంచి 2025 మధ్య క్రెడిట్‌ కార్డుల వినియోగం ఏటా సగటున 25.2 శాతం చొప్పున పెరిగింది. వ్యక్తిగత రుణాలు 20.1 శాతం వేగంతో పెరుగుతున్నాయి. దేశ ఆర్థిక వృద్ధి కంటే అప్పులు పెరిగే వేగం రెట్టింపుగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. ప్రజలు పొదుపును పక్కన పెట్టి, ఈఎంఐలపౖౖె వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. పెట్టుబడుల్లో సామాన్యుల మొదటి ప్రాధాన్యత భూములు, ఇండ్లకు ప్రాధాన్యత నిస్తున్నారు. ఇది జీడీపీలో 12.8 శాతానికి చేరింది. 2020లో కేవలం 4 శాతంగా ఉన్న షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడులు.. 2023-24లో 15 శాతానికి చేరాయి.
మందగమనానికి బాటలు..
గృహాల అప్పులు పెరగడం, పొదుపు క్షీణించడం వంటివి భవిష్యత్తులో ప్రజల కొనుగోలు శక్తిని తగ్గించవచ్చు. అప్పుల భారం పెరిగి ఆదాయం స్థిరంగా ఉంటే అది ఆర్థిక మందగమనానికి దారితీసే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2026-27లో వృద్ధి రేటును పెంచేందుకు అంతర్జాతీయ ఏజెన్సీ లు ప్రయత్నిస్తున్నప్పటికీ.. పెరుగుతున్న రుణ భారం, తగ్గుతున్న పొదుపు రేటు సామాన్యుడి కొనుగోలు శక్తిని హరించి వేస్తున్నాయి. ఫలితంగా క్షేత్రస్థాయిలో ఆర్థిక మందగమనం పొంచి ఉందన్న వాదనకు ఈ గణాంకాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -