Wednesday, April 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకళాభవన్‌లో ఘనంగా అంబేద్కర్‌ జయంతి

కళాభవన్‌లో ఘనంగా అంబేద్కర్‌ జయంతి

- Advertisement -

సిబ్బంది ఎవరూ ఆందోళన చెందొద్దు :ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
నవతెలంగాణ -హైదరాబాద్‌

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 135వ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ ఆర్టీసీ) మంగళవారం ఆర్టీసీ కళాభవన్‌ లో అత్యంత ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో టీజీఎస్‌ ఆర్టీసీ వైస్‌ ఛైర్మెన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వై. నాగిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు (ఈడీలు) సిహెచ్‌. వెంకన్న, ఖుస్రో షా ఖాన్‌, రాజశేఖర్‌, సాల్మన్‌, ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ విజయపుష్ప తదితరులు పాల్గొని అంబేద్కర్‌కు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎండీ వై. నాగిరెడ్డి మాట్లాడుతూ ఒక సమాజం ఎంత పురోగతి సాధించిందనేది ఆ సమాజంలోని మహిళలు సాధించిన అభివద్ధిని బట్టే తాను కొలుస్తానన్న అంబేద్కర్‌ మాటలను ప్రతి ఒక్కరూ మనసా వాచా స్మరించుకోవాలని గుర్తు చేశారు. మనదేశం ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వామ్య దేశంగా నిలవడానికి అంబేద్కర్‌ అందించిన అత్యున్నత రాజ్యాంగమే కారణమని కొనియాడారు. ప్రతి పౌరుడికి సమాన హక్కులు, అవకాశాలు కల్పించి, రాజ్యాంగ రక్షణ అందించిన మహనీయుని ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ బాధ్యత కలిగిన పౌరులుగా జీవించడమే మనం ఆ మహనీయునికి ఇచ్చే అసలైన నివాళి అని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమం పట్ల మేనేజ్‌మెంట్‌ ఎల్లప్పుడూ సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. కార్మికులు, సిబ్బంది ఎవరూ కూడా అనవసర ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. సిబ్బంది సమస్యలను పరిష్కరించడమే సంస్థ ప్రధాన ధ్యేయమన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -