రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్, తీగల సాగర్
సంఘం నల్లగొండ జిల్లా మహాసభ
నవతెలంగాణ-నల్లగొండ టౌన్
భారతదేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపైనా, రైతాంగ హక్కుల పరిరక్షణకు సమరశీల ఉద్యమాలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్, తీగల సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఏచూరి గార్డెన్‌లో మంగళవారం రైతు సంఘం జిల్లా 24వ మహాసభ జరిగింది. మహాసభ ప్రారంభానికి ముందు సంఘం జెండాను పోతినేని సుదర్శన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు మద్దతు ధరల చట్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్న కాంగ్రెస్ హామీ నెరవేరలేదన్నారు. పైగా కేంద్ర ప్రభుత్వం పంటల కొనుగోలు యాప్‌లో యూరియా అమ్మకం యాప్ తెచ్చినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ క్రమంలో రైతాంగాన్ని, వ్యవసాయాన్ని రక్షించుకోవడానికి అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల జీవితాల్లో ఆశించిన మార్పు రాలేదన్నారు. ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు.. పాలకుల నిర్లక్ష్యం మరోవైపు రైతన్న ను అప్పుల ఊబిలోకి నెట్టుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గడిచిన మూడేండ్లలో జరిగిన పోరాటాలను సమీక్షించుకోవడానికి, భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడానికి ఈ మహాసభ ఒక వేదిక అని తెలిపారు. పండించిన ప్రతి గింజకూ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు మద్దతు ధర కల్పించేలా పోరాటాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. పోడు సాగుదారులకు హక్కు పత్రాల పంపిణీలో జాప్యంతో అటవీ అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మహాసభలో నాయకులు వి.వెంకటేశ్వర్లు, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, బండ శ్రీశైలం, కందాల ప్రమీల, దేవిరెడ్డి అశోక్‌రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, చలకని మల్లయ్య, కత్తి శ్రీనివాస్‌రెడ్డి, అయితరాజు నరసింహ, మారయ్య, ముత్తిలింగం పాల్గొన్నారు.
రైతాంగ హక్కుల పరిరక్షణకు సమరశీల ఉద్యమాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



