Thursday, February 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసంగారెడ్డిలోని శ్రద్దా పాఠశాలలో అగ్నిప్రమాదం

సంగారెడ్డిలోని శ్రద్దా పాఠశాలలో అగ్నిప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ-సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపల్లిలో ఉన్న శ్రద్దా ప్రయివేట్‌ ఉన్నత పాఠశాలలో అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం పాఠశాల మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం జరిగి ఫర్నీచర్‌, పాఠ్యసామాగ్రి తదితర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. కాగా, మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదం ఎలా జరిగిందో కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని ఫైరింజన్లతో మంటలు ఆర్పివేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పాఠశాల సిబ్బందిని సంప్రదించగా ప్రమాదం ఎలా జరిగిందో తెలియదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -