నవతెలంగాణ-హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీసీసీఐ ఓ కీలక మార్పు చేసింది. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను టీ20 జట్టు నుంచి తప్పించింది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అతడి స్థానంలో మరో స్టార్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి ఎంపిక చేసింది.
రాబోయే సుదీర్ఘ అంతర్జాతీయ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ముందుస్తు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇటీవలి ప్రదర్శనల ఆధారంగా ప్రసిద్ధ్ కృష్ణను సిరాజ్ స్థానంలో భర్తీ చేశాం’ అని బీసీసీఐ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. జూన్ 26 నుంచి భారత జట్టు ఐర్లాండ్‌తో రెండు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత జులై 1 నుంచి జులై 11 వరకు ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల్లో తలపడనుంది.



