నవతెలంగాణ – మల్హర్ రావు
మండల మాజీ ఎంపిపి, మావోయిస్టుల చేతిలో హతమార్చిన ప్రజనాయకుడు స్వర్గీయ బెల్లంకొండ మల్హర్ రావు 37వ వర్థంతి వేడుకలు మండలం కొయ్యుర్ మంగళవారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి గొనె శ్రీనివాసరావు తోపాటు పలువురు నాయకులు మల్హర్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిరంతరం ప్రజల కోసం అతనే ఒక సైన్యంల పోరాడిన వ్యక్తిని, ప్రజల అవసరాల కోసం ఎవరినైనా ఎదిరిస్తానన్న నాయకుడు మల్హర్‌రావుని కొనియాడారు.
మండల అభివృద్ధికి బాటలు వేసిన మహానీయుడు, మన ముందు తరాలకు ఆయన చరిత్ర గొప్ప స్పూర్తినివ్వాలని, ఆయన ఆకాంక్ష,ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలన్నారు. సర్పంచ్‌గా మల్హర్‌రావు మండల అభివృధ్దికి బీజం వేశారని గుర్తు చేశారు. నాగులమ్మ ఆలయం నుంచి మల్లారం తాడిచర్ల వరకు రోడ్లు నిర్మాణం కోసం అధికారులను ఎదిరించారని, జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో పోరాటం చేసిన కొమురంభీం స్పూర్తితో మల్హర్‌రావు ఈ ప్రాంత అభివృధ్దికి ఎనలేని కృషి చేశారని, అడవులు అడ్గంగా ఉన్నా రోడ్ల నిర్మాణం చేయించిన గొప్ప నాయకుడని కొనియాడారు. కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్ తోపాటు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



