Tuesday, June 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం రేవంత్ రెడ్డి సభకు తరలి వెళ్ళిన మండల సమైఖ్య మహిళలు 

సీఎం రేవంత్ రెడ్డి సభకు తరలి వెళ్ళిన మండల సమైఖ్య మహిళలు 

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరుగనున్న ముఖ్యమంత్రి సభకు మద్నూర్ మండల మహిళా సమాఖ్య సభ్యులు తరలి వెళ్ళారు. మండల సమాఖ్యల ఆర్థిక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 553  మండల సమాఖ్యలకు 30 లక్షల గ్రాంట్ ను మంజూరు చేయడం జరిగిందని ఐకెపి ఎపిఎం జగదీష్ కుమార్ తెలిపారు. ఆయా మండల సమాఖ్య లు తన వాటాగా 6 లక్షల రూపాయలను కలిపి మొత్తం 36 లక్షలతో బస్సులను కొనుగోలు చేయడం జరిగింది అన్నారు. టీజీ ఆర్టీసీ వారు ఆ డబ్బులను 84 వాయిదాలలో ఒక్కో వాయిదా రూ.69,468 చొప్పున ఆయా మండల సమాఖ్య ఖాతాలకు  జమ చేయడం జరుగుతుందని తెలిపారు.

మంగళవారం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సికింద్రాబాద్ పరెడ్ గ్రౌండ్ లో 553 బస్ లను మండల సమాఖ్య ల మహిళల ఆధ్వర్యంలో ప్రారంభం చేయడం కోసం తరలి వెళ్లడం జరిగిందన్నారు. మద్నూర్ మండల సమాఖ్యకు కూడా ఒక బస్ ను కొనుగోలు చేయడం జరిగింది అని ఏపియం జగదీష్ కుమార్ తెలిపారు. ఈ బస్సు ప్రస్తుతం సిరిసిల్ల బస్ డిపో కు కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇదే బస్సులో (TG 23 Z 0029) మద్నూర్ మండలంలోని వివిధ గ్రామాల నుండి 50 మంది సభ్యులను సభకు తీసుకొని వెళుతున్నట్లు ఏపీఎం జగదీష్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు రేణుక, సీసీ లు సంగీత, సుమిత్ర, రాజశ్రీ, అనిల్, అకౌంటెంట్ నర్సింగ్ రెడ్డి, ఆశ వర్కర్ శాంతి, కానిస్టేబుల్ సుజాత వివిధ గ్రామాల సభ్యులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -