నవతెలంగాణ – జుక్కల్
ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుంద ప్రిన్సిపల్ కే. అశోక్ ఆదేశాల మేరకు నేడు కళాశాల అధ్యాపకులు జుక్కల్ మండలంలోని మైలారం, వజ్రకండి, డోనగావ్ గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ కళాశాల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని విద్యార్థులకు సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని అన్నారు. గ్రామాల్లోని విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలను వినియోగించుకోవాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సూచించారు. మండల పరిధిలోని గ్రామాలలోని ఇంటర్ పాసైన విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి, వారికి అవగాహన కల్పించారు. ఈ క్రమంలో అధ్యాపకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఆధునిక ల్యాబరేటరీ కలిగి ఉన్నాయన్నారు. నూతన విద్యా కోర్సులు ఏఈడీపి గురించి వివరించారు. అర్హత కలిగిన విద్యార్థులకు సంతూర్ స్కాలర్షిప్, అజీమ్ ప్రేమ్ జీ స్కాలర్షిప్ లు అందుతాయని వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ కళాశాలలో చేర్పించాలని కోరారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా.జీ.వెంకటేశం, డా. ఏ. రఘునాథ్ గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.అధ్యాపకులు ,సాయిలు బాలరాజ్,ఆనందరెడ్డి ,హన్మండ్లు ,డా. గంగారాం తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల ఇంటింటి ప్రచారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



