Tuesday, June 9, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహర్మూజ్‌లో కూలిన హెలికాప్ట‌ర్ వెలికితీత‌

హర్మూజ్‌లో కూలిన హెలికాప్ట‌ర్ వెలికితీత‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అమెరికా సైన్యానికి చెందిన అపాచీ హెలికాప్టర్ సోమవారం హర్మూజ్ జలసంధి సమీపంలో కుప్పకూలిన విష‌యం తెలిసిందే. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లోని ఇద్దరు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. తాజాగా హెలికాప్ట‌ర్ కోసం గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేసి ఎట్ట‌కేల‌కు ఆన‌వాళ్ల‌ను వెలికితీశారు. ఈ మేర‌కు ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.హెలికాప్టర్ కూలిపోవడానికి గల కచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదని ఆ మీడియా సంస్థ వెల్ల‌డించింది.

న్యూయార్క్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ట్రంప్, “పైలట్లు క్షేమంగా ఉన్నారు, ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు” అని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక నివేదికను విడుదల చేస్తామని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -