- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జైపూర్‌లోని ఓ బాణసంచా గోదాంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. తలాయ్ కాలనీలో బాణసంచా నిల్వ ఉంచిన ఒక ఇంట్లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. పేలుడు అనంతరం మంటలు వేగంగా వ్యాపించడంతో పలువురు కార్మికులు లోపల చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. ఏడుగురు తీవ్రంగా గాయపడి మరణించారని ధృవీకరించారు. మృతులను సమీర్, ఆబిద్, నాసిర్, అబ్దుల్ వాహిద్, బిలాల్‌గా గుర్తించగా మరో బాధితుడి వివరాలు తెలియరాలేదు.
- Advertisement -


