Tuesday, June 9, 2026
E-PAPER
Homeక్రైమ్వదినపై గొడ్డలితో దాడి చేసిన మరిది

వదినపై గొడ్డలితో దాడి చేసిన మరిది

- Advertisement -

నవతెలంగాణ-వర్ధన్నపేట
భూ తగాదాలతో మహిళను గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన మంగళవారం వర్ధన్నపేటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ల్యాబర్తి గ్రామంలో భూ పంపకాల్లో సూరారపు నాగరాజు వదిన కవితపై పగ పెంచుకుని మంగళవారం ఆమె మెడపై గొడ్డలితో నరికేందుకు యత్నించాడు. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన కవిత దాడిని తప్పించుకునే ప్రయత్నంలో అకస్మాత్తుగా చేయి అడ్డుపెట్టింది. ఈ దాడిలో మెడకు చిన్నపాటి గాయంతో పెద్ద ప్రమాదం తప్పినా.. గొడ్డలి చేతికి తాకి వేళ్లు తెగిపడ్డాయి. తీవ్ర రక్తస్రావమైన కవితను భర్త స్థానికులు, బంధువుల సాయంతో హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. నా భార్యపై కక్ష్య పెంచుకుని తనను చంపాలను చూస్తున్నాడని కవిత భర్త సూరారపు నిరంజన్ తమ్ముడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమకు ప్రాణ హాని ఉందని, మీరే న్యాయం చేయాలని వేడుకున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -