నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో నెలకొన్న రైతుల భూ సమస్యలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కాటారం ఆర్డీఓ రవీందర్ అన్నారు. తమతో పరిష్కారం కాకపోతే వెంటనే సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు అప్పీల్ చేయాలి తప్పా రైతులను కార్యాలయం చుట్టూ తిప్పించుకోవద్దని సూచించారు. మంగళవారం మండల కేంద్రమైన తాడిచెర్ల తహసీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ రవికుమార్ ఆధ్వర్యంలో ఆయా రెవెన్యూ గ్రామాల జిపిఓలు, రెవెన్యూ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. సాదాబైనామ, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను వెనువెంటనే విచారణ చేపట్టి నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని జిపిఓలను హెచ్చరించారు.
భూ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి: ఆర్డీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



