నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని మినీ స్టేడియం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సెకండ్ ఎడిషన్ సీఎం కప్ పురస్కరించుకొని, జిల్లా యొక్క 19 సంవత్సరాలలోపు బాలురు, బాలికల యొక్క సెలక్షన్స్ గురువారం నిర్వహించినట్టు జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సదామస్తుల రమణ తెలిపారు. ఈ యొక్క సెలక్షన్స్ కి 55 బాలురు , 45 బాలికలు ఇందులో పాల్గొనడం జరిగింది. 16 మందితో కూడినటువంటి తుదిచెట్టును ఎంపిక చేసి , త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ కి జిల్లా జట్టు ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు.
ఈ యొక్క కార్యక్రమానికి తను ముఖ్యఅతిథిగా విచ్చేసి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. శారీరకంగా, మానసికంగా ఎదుగుదల కొరకు క్రీడలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఎంపికైన జట్టును అభినందించి త్వరలో జరగబోయే రాష్ట్రస్థాయి టోర్నమెంట్ లో మొదటి స్థానం కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ యొక్క ఎంపిక ప్రక్రియలో ఫిజికల్ డైరెక్టర్ డి. చిన్నయ్య, డాక్టర్ స్వామి ఫిజికల్ డైరెక్టర్ జకోరా, సడక్ నాగేష్ ఫిజికల్ డైరెక్టర్ తోంపల్లి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో స్వామి, నాగేష్, అంజు, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.



