Friday, February 13, 2026
E-PAPER
Homeసినిమాపవర్‌ఫుల్‌ కంటెంట్‌తో 'మార్కండేయ'

పవర్‌ఫుల్‌ కంటెంట్‌తో ‘మార్కండేయ’

- Advertisement -

యంగ్‌ టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేసేందుకు నిర్మాత దిల్‌రాజు ‘దిల్‌ రాజు డ్రీమ్స్‌’ అనే బ్యానర్‌ స్థాపించారు. ఈ బ్యానర్‌లో తొలి ప్రయత్నంగా హీరో విక్రాంత్‌తో ‘మార్కండేయ’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాను మైథలాజికల్‌ థ్రిల్లర్‌ కథతో దర్శకుడు సిస్ట్లా వీఎంకే రూపొందిస్తున్నారు. గురువారం ఈ మూవీ టైటిల్‌ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేశారు. డైరెక్టర్‌ సిస్టా వీఎంకే మాట్లాడుతూ,’మేము ఈ సినిమాకు ఏఐని ఒక సపోర్ట్‌గా వాడాం తప్ప, ఏఐ నుంచి చేసిన షాట్స్‌ ఎక్కడా మూవీలో పెట్టలేదు’ అని అన్నారు. ‘ఇతిహాసాల నుంచి తీసుకున్న కథతో మేము చేస్తున్న ఒక మిస్టిక్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది. సీజీ ఎక్కువగా ఉండే చిత్రమిది. మార్కండేయుడి పాత్రకు మోడరన్‌ వెర్షన్‌ ఈ మూవీ. మార్కండేయుడికి ఎలాంటి కష్టాలు, ఇబ్బందులు వస్తాయో అలాగే ఈ మార్కండేయుడికి వస్తాయి.

ఆ పరమశివుడి దయతో ఆ సమస్యకు సమాధానాలు వెతికి, ఆ చిక్కుల్లోంచి ఎలా బయటపడ్డాడు అనేది మూవీలో చూపిస్తున్నాం. ఈ చిత్రంలో సాంకేతికత కంటే హ్యూమన్‌ ఎమోషన్స్‌కే మేము ప్రాధాన్యత ఇస్తున్నాం’ అని హీరో విక్రాంత్‌ చెప్పారు. నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ,’ పవర్‌ఫుల్‌ కంటెంట్‌తో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది మహాశివరాత్రికి విడుదల చేస్తాం. ఈ మూవీ గ్లింప్స్‌ చూసి అందరి నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మా దిల్‌ రాజు డ్రీమ్స్‌ బ్యానర్‌లో మరో నాలుగు చిత్రాలు నిర్మిస్తున్నాం. వాటిలో రెండు ఓటీటీ, మరో రెండు థియేట్రికల్‌గా రిలీజ్‌ అవుతాయి. ప్రస్తుతం ‘ఎల్లమ్మ, రౌడీ జనార్థన, దేత్తడి’ మూడు సినిమాలు చేస్తున్నాం’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -