Friday, February 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు

మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు

- Advertisement -

కానామెట్‌ విలేజ్‌ పరిధిలోని మండికుంట చెరువు కబ్జాల కూల్చివేత
తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసుకొని కిరాయికి ఇచ్చిన కబ్జాదారులు

నవతెలంగాణ-మియాపూర్‌
రంగారెడ్డి జిల్లా మాదాపూర్‌లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి, అక్రమ నిర్మాణాలు చేపట్టగా.. వాటిని హైడ్రా కూల్చివేసింది. శేరిలింగంపల్లి మండలం కానమెట్‌ విలేజ్‌ పరిధిలోని మొండికుంట చెరువు, పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో ఆక్రమ నిర్మాణాలను గురువారం హైడ్రా అధికారుల ఆధ్వర్యంలో తొలగించారు. హైడ్రా కాపాడిన 11 ఎకరాల ప్రభుత్వ భూమి విలువ సుమారు రూ.2,200 కోట్లు ఉంటుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వే నెం. 53లోని మొండికుంట, సర్వే నెం. 55లోని ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేశారని హైడ్రా ప్రజావాణిలో స్థానికులు ఫిర్యాదు చేశారు. దాంతో కమిషనర్‌ ఆదేశాల మేరకు రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది.

దాదాపు 11 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురయినట్టు గుర్తించింది. చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఆలయాన్ని హద్దుగా చూపించి కబ్జాదారులు ఆక్రమణలకు పాల్పడినట్టు నిర్థారించారు. ఆలయం హద్దుగా ఉన్న ఆ భూమిలో తాత్కాలికంగా 30కి పైగా షెడ్లను ఏర్పాటు చేసి, వాటిని కిరాయికి ఇచ్చి నెలకు లక్షల్లో అద్దె వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నట్టు అధికారులు గుర్తించారు. దాంతో గురువారం ఉదయం సదరు భూమిలో ఉన్న షెడ్లును పూర్తిగా తొలగించి, ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. 11 ఎకరాల భూమి విలువ సుమారు రూ.2,200 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. ఇదిలా ఉంటే గతంలో మండికుంట చెరువు సుందరీకరణ పనులు చేపట్టగా.. దీనిపై కొంతమంది ప్రయివేట్‌ వ్యక్తులు కోర్టుకు వెళ్లడంతో పనులు నిలిచిపోయాయి. ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా అధికారులకు స్థానికులు అభినందనలు తెలిపారు. హైడ్రా చర్యల పట్ల హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -