Friday, February 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజీహెచ్‌ఎంసీ విభజనలో హేతుబద్ధత లేదు

జీహెచ్‌ఎంసీ విభజనలో హేతుబద్ధత లేదు

- Advertisement -

ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం
3 కార్పొరేషన్ల ఏర్పాటుపై పునరాలోచన చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డికి మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి లేఖ


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)ని మూడు కార్పొరేషన్లుగా ప్రకటించటంలో ఎలాంటి హేతుబద్ధత పాటించలేదని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి పి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయడంపై పునరాలోచన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆమె గురువారం లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని మహేశ్వరం, రాజేంద్రనగర్‌, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలను రెండు వేర్వేరు కార్పొరేషన్లలో కలపటంలో మతలబు ఏంటని ప్రశ్నించారు.

సైబరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉన్న బండ్లగూడ, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌ వంటి ప్రాంతాలను జీహెచ్‌ఎంసీలో చేర్యడమెందుకని అడిగారు. మల్కాజిగిరి కార్పొరేషన్‌కు పక్కనే ఉన్న బడంగ్‌పేట్‌, తుక్కుగూడ, మీర్‌పేట్‌ ప్రాంతాలను జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉంచడమేంటనీ ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయంజాల్‌ ప్రాంతాన్ని మల్కాజిగిరిలో చేర్చకుండా జీహెచ్‌ఎంసీలో చేర్చడం ఏ విధమైన ప్రాతిపదిక అని తెలిపారు. ఈ విభజనకు భౌగోళిక, పరిపాలనా, జనాభా ప్రమాణాలు పాటించారా? లేక ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నారా?అని ప్రశ్నించారు. ఇది అనాలోచి నిర్ణయమే కాకుండా ప్రజలకు అనవసరమైన పరిపాలనా భారాన్ని మోపే చర్య అని విమర్శించారు.

అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనే డివిజన్ల విభజన ఉంటుందని జీహెచ్‌ఎంసీ సమావేశంలో అధికారులు వివరించారని గుర్తు చేశారు. అందుకు విరుద్ధంగా రెండు నియోజకవర్గ ప్రాంతాలను కలుపుతూ డివిజన్ల ఏర్పాటు చేయడం వెనుక ఎలాంటి హేతుబద్ధత ఉందో అర్థం కావడం లేని ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ సమావేశంలో ఎమ్మెల్యేలు లేవనెత్తిన అభ్యంతరాలను కూడా ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. హేతుబద్ధతతో కూడిన సమతుల్య విభజనను చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తప్పును సరిదిద్దుకుని ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు సాగుతుందని ఆశిస్తున్నానని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -