Thursday, June 11, 2026
E-PAPER
Homeవరంగల్జీపీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి: టీయూసీఐ

జీపీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి: టీయూసీఐ

- Advertisement -

నవతెలంగాణ-పెద్దవంగర
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ) రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి రవి డిమాండ్ చేశారు. పెద్దవంగర మండల కేంద్రంలో శ్రీకాంత్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని సుమారు 12 వేల గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న 60 వేల మంది కార్మికులను ఇటీవల విడుదల చేసిన కనీస వేతనాల జీవోలో చేర్చకపోవడం అన్యాయమన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికులకు కనీస వేతనం, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు.

జీవో నంబర్–51ను రద్దు చేసి కేటగిరీల వారీగా పనులు కేటాయించాలని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 13 వరకు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లకు వినతిపత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 15న ఎంపీడీవో కార్యాలయాల ఎదుట ధర్నాలు, 22న జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు పాడియా బీకు, జిల్లా నాయకులు కుమార్, దేవా, సంపత్, సిద్ధు, రమా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -