- Advertisement -
- – 13 వార్డులకు గాను 11 వార్డుల్లో విజయం
- – మంత్రి శ్రీదర్ బాబు పాలనకు జై కొట్టిన మంథని ప్రజలు
- నవతెలంగాణ-మల్హర్ రావు
- మున్సిపాలిటీ ఎన్నికల్లో మంథని చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుపాలనకు, సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు మంథని మున్సిపల్ ప్రజలు జై కొట్టారు. మంథని మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 13 వార్డులు ఉండగా 11 వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలుపొంది మంథని మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టిఆర్ఎస్ ఒక స్థానానికి పరిమితం కాగా.. బిజెపి ఖాతా తెరువలేదు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒక స్థానాన్ని గెలుచుకుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక మంత్రిగా..సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా.. రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు.. తన సొంత నియోజకవర్గమైన మంథని నియోజక వర్గ సమగ్ర అభివృద్ధి, సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులను తీసుకువచ్చి అభివృద్ధి మార్కును చూపిస్తున్నారు.
- అంతేకాక మంథని పట్టణ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులను తీసుకువచ్చి మంథని మున్సిపాలిటీ రాష్ట్రంలోనే మోడల్ టౌన్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. అన్న మంత్రి శ్రీధర్ బాబు కు తోడుగా తమ్ముడు టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు సైతం మంథని మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంలో తన వంతు పాత్ర పోషించారు. మంథని మున్సిపల్ ఒకటవ వార్డు కాంగ్రెస్ కుర్ర లింగయ్య, రెండో వార్డ్ కాంగ్రెస్ నూకల కమల్, మూడో వార్డు టిఆర్ఎస్ మాచిడి రాజుగౌడ్, నాలుగో వార్డ్ కాంగ్రెస్ ఎరుకల స్రవంతి రమేష్, ఐదవ వార్డు కాంగ్రేస్ ముస్కుల సహెందర్ రెడ్డి, ఆరో వార్డు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పోతరవేణ క్రాంతి, ఏడవ వార్డ్ కాంగ్రెస్ జంబోజు శ్రీమతి సమ్మయ్య, 8వ వార్డు కాంగ్రెస్ లైశెట్టి రజిత రాజు, 9వ వార్డు కాంగ్రెస్ మారుపాక నిహారిక నాగరాజు, పదవ వార్డ్ కాంగ్రెస్ పెంటరి రాజు, 11వ వార్డు కాంగ్రెస్ వోడ్నాల సమ్మయ్య, 12 వార్డు కాంగ్రెస్ వేముల లక్ష్మిసమ్మయ్య, 13 వార్డు కాంగ్రెస్ ఎల్లంకి వంశీ లు గెలుపొందారు. 13 వార్డుల్లో గాను 11 వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని మంథని మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు.
- Advertisement -



