Friday, February 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోతునూరు సర్పంచ్ పనితీరుపై గ్రామస్థుల హర్షం

పోతునూరు సర్పంచ్ పనితీరుపై గ్రామస్థుల హర్షం

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
మండలంలోని పోతునూరు పంచాయతీ లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సర్పంచిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పెండ్యాల సంతోష్ రావు  గ్రామంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించారు. ముఖ్యంగా పోతునూరు పంచాయతీ పరిధిలో గల పోలేపల్లి గ్రామంలో రహదారికి ఇరువైపులా ఉన్న కంప చెట్లను జెసిపి సహాయంతో తొలగించి శుభ్రం చెయస్తున్నారు.

రోడ్డుపై వున్న గుంతలు పూడ్చిడమే కాక రోడ్లకు ఇరువైపులా వున్న కంపచెట్లు, పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. ఈ సమస్యను గుర్తించిన సర్పంచి, ఉపసర్పంచి జేసీబీ తో రోడ్లకు ఇరువైపులా పెరిగిన కంపచెట్లను తొలగించటం మొదలుపెట్టారు. సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే గ్రామంలో మంచినీటి సౌకర్యం, పాఠశాలలో నెలకొన్న సమస్యలు,గ్రామం లో పారిశుధ్య పనుల పై దృష్టి సారించి ఒక్కక్కటిగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. దీంతో గ్రామస్తులు సర్పంచి చేస్తున్న పనులపై గ్రామస్తులు హర్షం వ్యకం చేస్తున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -