Saturday, February 14, 2026
E-PAPER
Homeఆటలుసెమీఫైనల్లో సీవీ ఆనంద్‌

సెమీఫైనల్లో సీవీ ఆనంద్‌

- Advertisement -

హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌

హైదరాబాద్‌ : 23వ హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో సీవీ ఆనంద్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జూబ్లిహిల్స్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో జరిగిన పురుషుల 55 ప్లస్‌ సింగిల్స్‌ విభాగంలో సీవీ ఆనంద్‌ 6-4, 6-4తో వరుస సెట్లలో మణికన్నపై సాధికారిక విజయం నమోదు చేశాడు. 40 ప్లస్‌ సింగిల్స్‌లో మధుసూదన్‌ రావు 6-3, 6-2తో అమిత్‌రెడ్డిపై నెగ్గగా, జి రాజ 6-1, 7-5తో నిఖిల్‌పై విజయంతో సెమీస్‌కు చేరుకున్నారు. హేమంత్‌ కుమార్‌ (60 ప్లస్‌ సింగిల్స్‌) 6-1, 6-0తో ప్రతాప్‌ రెడ్డిపై , మెహర్‌ ప్రకాశ్‌ (65 ప్లస్‌ సింగిల్స్‌) 6-1, 6-0తో ఇసయ్యపై, గజపతి (70 ప్లస్‌ సింగిల్స్‌) 6-1, 6-2తో ఎర్రగాటు స్వామిపై, రామమోహన్‌ (75 ప్లస్‌ సింగిల్స్‌) రమేశ్‌ కుమార్‌పై 6-1, 6-1తో విజయాలు సాధించి సెమీఫైనల్లో కాలుమోపారు.

డబుల్స్‌ విభాగంలో విశాక్‌, ఈశ్వర్‌ సాయి జోడీ (35 ప్లస్‌) 6-3, 6-2తో ప్రమోద్‌, జయనారాయణలపై.. మెహర్‌ ప్రకాశ్‌, ఆనంద్‌ కుమార్‌ జోడీ (60 ప్లస్‌) 7-6, 6-3తో వెంకటరమణ, మధుకర్‌లపై.. గజపతి, సన్యాసి రాజు (70 ప్లస్‌) జోడీ 602, 6-4తో చంద్రశేఖర్‌, కులశేఖర్‌లపై.. రామమోహన్‌, సదాశివ రెడ్డి జోడీ (75 ప్లస్‌) 6-3, 6-1తో రాజరత్నం, ఎర్రగాటు స్వామిలపై గెలుపొంది సెమీఫైనల్స్‌ బెర్త్‌లు ఖాయం చేసుకున్నారు. 55 ప్లస్‌ విభాగం క్వార్టర్‌ఫైనల్లో నంద్యాల నరసింహారెడ్డి, నీలకంఠ జోడీ 6-4, 7-6(7-4), 12-10తో మూడు సెట్ల ఉత్కంఠ పోరులో రామ్‌ ప్రియదర్శిని, విక్రమ్‌ నాగ్‌పాల్‌లపై మెరుపు విజయం సాధించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -