ఫిడే మహిళల క్యాండిడేట్స్ టోర్నీ విజేతగా
నిలిచిన తొలి భారతీయురాలు
సైప్రస్: ఫిడే మహిళల క్యాండిడేట్స్ టోర్నీ విజేతగా నిలిచిన ఆర్. వైశాలి తొలి భారతీయురాలిగా నయా చరిత్రను లిఖించింది. ఈ టోర్నీ చరిత్రలో భారత్‌కు చెందిన ఒక మహిళా గ్రాండ్‌మాస్టర్ విజేతగా నిలవడం ఇదే తొలిసారి. బుధవారం రాత్రి జరిగిన 14వ, ఫైనల్ రౌండ్లో కాటెరీనా లాగ్నో(ఉక్రెయిన్)ను ఓడించిన వైశాలి ఫిడే మహిళల క్యాండిడేట్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీంతో ఈ ఏడాది చివర్లో జరిగే మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం జూ వెన్జున్(చైనా)తో తలపడనుంది. 1952లో తొలిసారి మహిళల క్యాండిడేట్స్ టోర్నీ ప్రారంభం కాగా.. 1997వరకు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత టోర్నీగా మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత మ్యాచ్ ఫార్మాట్ స్థానంలో నాకౌట్ టోర్నమెంట్లో వచ్చాయి. మహిళల ప్రపంచ ఛాంపియన్ విజేతను తేల్చడానికి ఫిడే మ్యాచ్ ఫార్మాట్‌ను పునరుద్ధరించిన తర్వాత 2019లో క్యాండిడేట్స్ టోర్నీ తిరిగి ప్రారంభమైంది. ఈ టోర్నీలో రష్యా గ్రాండ్మాస్టర్లదే హవా. 1952నుంచి 1988వరకు ఏకచక్రాధిపత్యం చెలాయించిన రష్యా గ్రాండ్‌మాస్టర్లకు తొలిసారి చైనా గ్రాండ్‌మాస్టర్లు చెక్ పెట్టారు. 1990లో షీ జుంగ్ రష్యా గ్రాండ్‌మాస్టర్ల రికార్డుకు బ్రేక్ వేయగా.. ఆ తర్వాత 1992లో జార్జియా 1994లో హాంగేరీ గ్రాండ్‌మాస్టర్లు టైటిల్ విజేతలుగా నిలిచారు. 1998 నుంచి 2021 వరకు ఈ టోర్నీని రద్దు చేయగా.. తిరిగి 2022 నుంచి మహిళల క్యాండిడేట్స్ టోర్నీ పునరుద్ధరించబడింది. 2022, 2024లో చైనా మహిళా గ్రాండ్‌మాస్టర్లు విజేతలుగా నిలువగా.. 2026లో అంచనాలకు మించి రాణించి రమేష్‌బాబు వైశాలి విజేతగా నిలిచి త్రివర్ణ పతకాన్ని ప్రపంచపటంలో లిఖించింది.
వైశాలి కొత్త చరిత్ర
- Advertisement -
- Advertisement -



