ఆర్మూర్ రూరల్ సీఐ గడ్డం జాన్ రెడ్డి
నవతెలంగాణ-బాల్కొండ
యువత చెడు వ్యసనాలకు బానిసలై బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం మత్తుపదార్థాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. గంజాయి సాగు, రవాణ, విక్రయాలు, త్రాగడం వంటివి చేస్తే నేరమని తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు జరుగవన్నారు.సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని,మోసాలకు పాల్పడుతున్న వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శైలేందర్, ఏఎస్ఐ చిన్నయ్య, పోలీస్ సిబ్బంది విద్యార్థులు యువకులు తదితరులు పాల్గొన్నారు.
చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



