Saturday, June 13, 2026
E-PAPER
Homeఆటలుఅఫ్గానిస్థాన్‌తో నేడు తొలి వ‌న్డే

అఫ్గానిస్థాన్‌తో నేడు తొలి వ‌న్డే

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మూడు వన్డేల సిరీస్‌ల్లో భాగంగా అఫ్గానిస్థాన్‌,ఇండియాల మ‌ధ్య తొలి పోరు జ‌ర‌గ‌నుంది.శనివారం మ‌ధ్యాహ్నం ధర్మశాల వేదిక‌గా రెండు జ‌ట్ల మ‌ధ్య తొలి వ‌న్డే మ్యాచ్ ఆడ‌నున్నాయి. గాయాల కార‌ణంగా జ‌ట్టుకు విరాట్ కోహ్లీ, హార్థిక్ పాండ్యా దూర‌మైయ్యారు. సీనియర్‌ పేసర్లు బుమ్రా, సిరాజ్‌కు విశ్రాంతినివ్వడంతో అర్ష్‌దీప్‌ సింగ్, ప్రసిద్ధ్‌ కృష్ణ కొత్త బంతిని పంచుకోనున్నారు. శుభ‌మ‌న్ గిల్ నాయ‌క‌త్వంలో టీమిండియా పోరుకు సిద్ధంగా కానుంది. సిరీస్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగనున్న టీమ్‌ఇండియా ప్రధానంగా 2027 ప్రపంచకప్‌ కోసం జట్టు నిర్మాణంపై దృష్టి సారించనుంది. జ‌ట్టులో సీనియర్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ ఆట‌పై అంద‌రి దృష్టి కేంద్రీకృతం కానుంది.

భారత్‌: గిల్‌ (కెప్టెన్‌), రోహిత్, ఇషాన్‌ కిషన్, శ్రేయస్, రాహుల్, నితీశ్‌ కుమార్, వాషింగ్టన్‌ సుందర్, కుల్‌దీప్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్‌ కృష్ణ, ప్రిన్స్‌/గుర్నూర్‌ బ్రార్‌.

అఫ్గానిస్థాన్‌: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్‌), ఇబ్రహీం జద్రాన్, రహ్మనుల్లా గుర్బాజ్, సెదికుల్లా అటల్, రహ్మత్‌ షా, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, అలీఖిల్, రషీద్, మహ్మద్‌ సలీమ్, జియావుర్‌ రెహ్మాన్, ఘజన్‌ఫర్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -