Wednesday, June 17, 2026
E-PAPER
Homeజాతీయంపేప‌ర్ లీకేజీ సంఘ‌ట‌న‌ల‌పై రాహుల్ గాంధీ కీల‌క కార్యాచ‌ర‌ణ‌

పేప‌ర్ లీకేజీ సంఘ‌ట‌న‌ల‌పై రాహుల్ గాంధీ కీల‌క కార్యాచ‌ర‌ణ‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: నీట్ పేప‌ర్ లీకేజీ, సెంట్ర‌ల్ బోర్డు ప‌రీక్ష పత్రాల మూల్యాంక‌నంలో అవ‌క‌త‌వ‌క‌లు తదిత‌ర సంఘ‌ట‌న‌ల‌పై ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ కీల‌క కార్యాచ‌ర‌ణ‌ చేప‌ట్టారు.‘పరీక్షల కుంభకోణాలు(examination scandals”)‘ పేరుతో దేశవ్యాప్తంగా విద్యార్థుల‌తో స‌ద‌స్సులు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.నీట్ (NEET-UG) వంటి ప్రతిష్టాత్మక పరీక్షల లీకేజీల వల్ల నష్టపోయిన లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగ అభ్యర్థులు, విద్యావేత్తలు, యువజన సంఘాలను ఒకే తాటిపైకి తీసుకురావడమే ఈ దేశవ్యాప్త ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం అని ఆయన స్పష్టం చేశారు.ఈ క్యాంపెయిన్‌లో భాగంగా ఎన్ఎస్‌యూఐ (NSUI), యూత్ కాంగ్రెస్, స్థానిక కాంగ్రెస్ కమిటీలు దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, కోచింగ్ సెంటర్లు, పాఠశాలల్లో విద్యార్థులతో ప్రత్యక్షంగా మమేకమవుతాయని వివరించారు. నీట్ పరీక్షల వికేంద్రీకరణ, పరీక్షల ఫీజుల రద్దు, పేపర్ లీక్ ముఠాలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లను ఈ సదస్సుల ద్వారా వీధుల్లోకి తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు.

కోటా నుంచి ఢిల్లీ వరకు షెడ్యూల్ ఖరారు..

రాహుల్ గాంధీ నిర్వహించబోయే ఈ భారీ విద్యార్థి సదస్సుల షెడ్యూల్‌ను కేసీ వేణుగోపాల్ అధికారికంగా విడుదల చేశారు.

జూన్ 17: కోచింగ్ హబ్‌గా పేరుగాంచిన రాజస్థాన్‌లోని కోటా లో మొదటి భారీ సదస్సు ప్రారంభం కానుంది.

జూలై 10: ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్) లో రెండవ సదస్సు జరుగుతుంది.

జూలై 11: బీహార్ రాజధాని పాట్నా లో మూడవ విద్యార్థి మహాసభను నిర్వహిస్తారు.

జూలై 14: దేశ రాజధాని న్యూఢిల్లీలో ముగింపు సదస్సు భారీ ఎత్తున జరగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -