Saturday, June 13, 2026
E-PAPER
Homeజాతీయంఅస్సాంలో కూలిన వాయుసేన విమానం

అస్సాంలో కూలిన వాయుసేన విమానం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అస్సాంలోని జోర్హాట్ ఎయిర్‌బేస్‌లో శనివారం భారతీయ వాయుసేన ఐఏఎఫ్ కు చెందిన ఏఎన్-32 (AN-32) రవాణా విమానం ప్రమాదానికి గురైంది. సైనిక స్థావరం లోపల రన్‌వేపై విమానం ల్యాండ్ అయిన వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్‌బేస్ సిబ్బంది అత్యవసర సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై భారతీయ వాయుసేన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. “జోర్హాట్‌లో ఈరోజు ఐఏఎఫ్‌కు చెందిన AN-32 విమానం ప్రమాదానికి గురైంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియచేస్తామని పేర్కొంది.

ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర రెస్క్యూ టీమ్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని రంగంలోకి దిగాయి. ఈశాన్య రాష్ట్రాల్లో భారత వాయుసేనకు చెందిన అతిముఖ్యమైన స్థావరాలలో రౌరియా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఒకటి. అస్సాంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వైమానిక కార్యకలాపాలు నిర్వహించడంలో ఇది అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -