Saturday, February 14, 2026
E-PAPER
Homeఆదిలాబాద్అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తాం..

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తాం..

- Advertisement -

– బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్
నవతెలంగాణ – బజార్ హాత్నూర్
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ అన్నారు. శనివారం మండలంలోని భూతాయి గ్రామానికి చెందిన పాడ్వాల్ ప్రహ్లాద్ నూతన ఇందిరమ్మ ఇళ్లు గృహ గృహప్రవేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ.. ప్రతి పేదవాడి సొంతింటి కల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రజాక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జెల్కే పాండురంగ్, మోర్కండి సర్పంచ్ తొడసం నాందేవ్, నాయకులు కళ్ళెం విఠల్, సూర్యవంశీ పండురంగ్, పాడ్వాల్ రాజు, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం పోతారెడ్డి, యండి సద్దాం, సయ్యద్ సల్మాన్, యువజన మండల అధ్యక్షుడు కనిందే దినేష్, గవ్వల దేవేందర్, గొల్ల నాగు రమేష్, కీర్తి రమణ, తాండ్ర రమణ, సందీప్, బాల రవి, కుప్సే గణేష్, మారుతి, కిరప్ప విఠల్, దంగరి పండరి, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -