Sunday, February 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్దటాక్లిలో యువత రక్తదాన శిబిరం

పెద్దటాక్లిలో యువత రక్తదాన శిబిరం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండలంలోని పెద్ద టాక్లి గ్రామంలో ఆదివారం ఆ గ్రామంలోని నర్సుగొండ వర్ధంతిని పురస్కరించుకొని యువకులు రక్తదాన శబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి యువకులు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు యువకులను అభినందించారు. అనంతరం సర్పంచ్ కుమారుడు గైక్వాడ్ విలాస్ మాట్లాడుతూ.. రక్తదానం చేయడం ఒకరి ప్రాణం కాపాడడమేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విలాస్ గైక్వాడ్, సాయిలు గోండా, నాగ్నాథ్ పటేల్, రమేష్ గోండా, సుధాకర్, సమీర్, మాధవ్, యూనుస్ , ముబీన్, అల్తాఫ్, షాదుల సాబ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -