Sunday, June 14, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఆర్జీయూకేటీ బాసర మెస్ సంఘటనపై అధికారుల తీవ్ర ఆగ్రహం           

ఆర్జీయూకేటీ బాసర మెస్ సంఘటనపై అధికారుల తీవ్ర ఆగ్రహం           

- Advertisement -

విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
నవతెలంగాణ – ముధోల్ 
ఆర్జీయూకేటీ బాసర క్యాంపస్‌లోని మెస్ నంబర్ 2 లో ఈ రోజు ఉదయం అల్పాహారం తింటున్న సమయంలో ఓ విద్యార్థి పళ్లెంలో బొద్దింక రావడంపై విశ్వవిద్యాలయ అధికారులు తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, ఆహార నాణ్యత విషయాల్లో ఇలాంటి నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించేది లేదని వారు స్పష్టం చేశారు. ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించిన వర్సిటీ యంత్రాంగం, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను తేల్చేందుకు తక్షణమే ఒక ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు వారు ఒక్క ప్రకటనలో తెలిపారు.

గత కొన్ని నెలలుగా క్యాంపస్‌లో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏవీ జరగలేదని, ఈ రోజు ఉదయం అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఈ ఘటన అటు విద్యార్థులను, ఇటు అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వారు పేర్కొన్నారు. క్యాంపస్‌లోని మెస్సుల నిర్వహణకు సంబంధించిన విషయాలపై ఇకనుంచి మరింత పటిష్టమైన చర్యలు తీసుకుంటామని అధికారులువెల్లడించారు.

మెస్సులలో ఆహార భద్రతను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఇప్పటికే ఇందులో విద్యార్థులను కూడా భాగస్వాములను చేశామని తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థుల భాగస్వామ్యాన్ని మరింత పెంచుతూ, మెస్సుల పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేస్తామనివివరించారు.ఈ విచారణ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులైన వారిపై అత్యంత కఠిన చర్యలుతీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. క్యాంపస్‌లోని అన్ని మెస్‌లలో ఆహార భద్రతా ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, సుమారు 9000మంది విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా  చూస్తున్నామని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -