Friday, August 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సొసైటీ బలోపేతానికి తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలి

సొసైటీ బలోపేతానికి తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలి

- Advertisement -

– సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి
నవతెలంగాణ – తొగుట

సొసైటీ బలోపేతానికి రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలని సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రం కాన్గల్ సొసైటీ కార్యాలయం చైర్మన్ ఆధ్వ ర్యం పాలక వర్గంతొ సర్వసభ సమావేశం నిర్వహించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ.. గతంలో  మండలంలో ఉన్న 4 సొసైలను కలిపి కాన్గల్ సొసై టీగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సొసైటీ బలో పేతానికి రైతులందరు కృషి చేయాలని అన్నారు. రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే సొసైటీ మరింత బలోపేతం అవుతుందన్నారు.

సమావేశంలో ముఖ్య విషయమై దీర్ఘకాలిక, స్వల్ప కాలిక రుణాలపై చర్చించామని తెలిపారు. నష్టాల లో ఉన్న సొసైటీని లాభాల బాటలోకి తీసుకురావ డానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తే సొసైటీ మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఈ సంవత్సర కాలంలో పాలక వర్గం, సిబ్బందితొ కలిసి ఎస్టి రుణాలు రూ. 31 లక్షలు, ఎల్టీ రుణాలు దాదాపు రూ. 15 లక్షల వసూలు చేశామని చెప్పారు. రైతు లకు కావలసిన ఎరువులు సొసైటీ ద్వారా అంద జేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి, డైరెక్టర్లు ఎర్రన్న గారి శ్రీనివాస్ రెడ్డి, చెప్యాల నారాయణరెడ్డి, ఎన్నం మహిపాల్ రెడ్డి, చింతమడక శ్రీధర్, అల్వాల కృష్ణ గౌడ్, పాత్కుల ఎల్లయ్య, సీఈఓ గంగారెడ్డి తదిత రులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -