- Advertisement -
నవతెలంగాణ – రెంజల్ : రెంజల్ మండలం కిసాన్ తాండ గ్రామంలో తీజ్ పండుగ వేడుకలను గిరిజనులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తమ గ్రామంలో సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణం చేపట్టిన మొదటి సారిగా ఈ తీజ్ పండుగ వేడుకలను నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. గత 9 రోజుల కిందట గోధుమలు చల్లిన నారును పెళ్లి కానీ ఆడపడుచులకు ఈ పండుగ ఒక ప్రత్యేకత. పాడి పంటలు బావుంటూ ఆడపిల్లలకు మంచి జరగాలన్న తలంపుతో వారు భోగుబండారు నిర్వహించి ఘనంగా ఈ పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ తాండ గ్రామ సర్పంచ్ తో పాటు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు, ఆడపిల్లలు పెద్ద మొత్తంలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.
- Advertisement -



