– భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. 56 రకాల వంటకాలతో నైవేద్యం
– యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆకర్షనీయంగా ఉట్టి కొట్టే కార్యక్రమం
నవతెలంగాణ – బాల్కొండ
బాల్కొండ మండల పరిధిలో శుక్రవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి శ్రీకృష్ణుడికి 56 రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పించారు. ఆలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.మండల కేంద్రంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు ఆకర్షణీయంగా వీక్షించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు, పలువురు నాయకులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
బాల్కొండలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



